శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (11:28 IST)

గూగుల్‌లో ఉద్యోగాలు.. ఏకంగా 3,800 పోస్టులు భర్తీ

గూగుల్‌లో ఉద్యోగం కోరుకుంటున్నారా? ఐతే మీకు మంచి అవకాశం రాబోతోంది. త్వరలో గూగుల్‌ భారత్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఏకంగా 3,800 పోస్టుల్ని భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

భారతదేశంలోని అన్ని గూగుల్ కార్యాలయాల్లో వీరిని నియమించనుంది. గూగుల్ ఎక్కువగా తక్కువ వేతనంతో పనిచేసే ఉద్యోగులపై, థర్డ్ పార్టీ టెంపరరీ వర్కర్స్‌పై ఆధారపడుతుందని విమర్శలొస్తున్నాయి. 
 
దీంతో భారతదేశంలోని గూగుల్ కార్యాలయాల్లో 3,800 ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగాల కింద భర్తీ చేసే వారిని కస్టమర్ కేర్ సపోర్ట్ కోసం  నియమించుకోనుంది.

ప్రస్తుతం కస్టమర్ సపోర్ట్, యూజర్ సపోర్ట్, యూజర్స్‌తో కాల్స్ మాట్లాడటం, ప్రొడక్ట్ ట్రబుల్ షూటింగ్, క్యాంపైన్ లాంటి వాటికి థర్డ్ పార్టీ కంపెనీలపై ఆధారపడుతోంది.

తాజా నియామకాల ద్వారా ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు భారత్‌తో పాటు అమెరికా, ఫిలిప్పైన్స్‌ వరకు విస్తరిస్తాయని గూగుల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.