శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (23:24 IST)

''కూ'' యాప్ కథ ఏంటి..? ఎలా పుట్టింది..?

Koo
కూ యాప్ గురించే ప్రస్తుతం నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే దిశగా జనం ఎగబడుతున్నారు. అయితే ఈ యాప్ ద్వారా డేటా లీక్ అవుతుందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నా.. ఈ దేశీ యాప్‌కి క్రేజ్ పెరిగిపోతోంది. ఇక ఈ కూ యాప్‌ గురించి కాస్త తెలుసుకుందాం.. కూ యాప్ ట్విట్టర్‌ తరహాలోనే మైక్రో బ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌. 2020 మార్చిలో ఈ యాప్‌ను తీసుకొచ్చారు. 
 
దీనిని ఎమ్‌బీఏ స్టూడెంట్లు రాధాకృష్ణ, మయాంక్‌ బిడవట్కాలు రూపొందించారు. ఇందులో ట్విట్టర్‌ మాదిరిగానే మల్టీమీడియా పోస్ట్‌లు పెట్టొచ్చు. ఇక ఈ యాప్‌లోనూ గరిష్టంగా 400 అక్షరాలు రాసుకోవచ్చు. అది కూడా ఇంగ్లీష్‌తో పాటు ఆరు భారతీయ భాషల్లో. ట్విట్టర్‌కి ఉన్నట్లే కూ యాప్‌ లోగో కూడా పక్షే. అయితే బ్లూ కలర్‌ స్థానంలో ఎల్లో కలర్‌ ఉంది. అక్కడ రీట్వీట్‌ ఉంటే.. రీ కూ అని ఉంది. రాధాకృష్ణ, మయాంక్‌లకి వోకల్‌ అనే వీడియో, ఆడియో నాలెడ్జ్‌ షేరింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ కూడా ఉంది.
 
టెక్‌ ఇన్నోవేషన్‌లో ఈ యాప్‌ కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకుంది. ఇటీవలే ఈ యాప్‌లో దాదాపు 4 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ అంటే ట్విట్టరే. బాలీవుడ్‌ నటులతో పాటు పొలిటీషియన్స్‌, ఇతర ప్రముఖులు దీనినే ప్రధానంగా వాడుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా కొందరు ప్రముఖులు కూ యాప్‌కి మారుతున్నారు. ట్విట్టర్‌కి దేశంలో కోటీ 75 లక్షల మంది యూజర్లు ఉన్నారు. అమెరికా, జపాన్‌ తర్వాత ఇక్కడే అత్యధికం. ఇప్పుడు ఇక్కడి యూజర్లు కూ యాప్‌కి వలసెళ్తున్నారు.
 
ప్రధాని మోదీ ఇంకా యాప్‌లో జాయిన్‌ కానప్పటికీ.. గతేడాది మన్‌కీ బాత్‌లో దీనిపై మాట్లాడారు. కూ అని ఓ యాప్‌ ఉందని.. మన అభిప్రాయాలను మన భాషలో చెప్పుకోవచ్చని అన్నారు. అయితే ఈ రెస్పాన్స్‌ చూసి కూ యాప్‌ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.