1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (13:15 IST)

జస్ట్ 10 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ చార్జి ఫుల్

స్మార్ట్ ఫోన్ల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. అందులోనూ తాజా మోడళ్ళను వాడేందుకే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‍లో ఏ ఒక్క కొత్త ఫోన్ వచ్చినా దాన్ని కొనుగోలు చేసిన వాడేందుకు ఇష్టపడుతున్నారు. 
 
అదేసమయంలో స్మార్ట్ ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య పెరుగుతుండడంతో మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్స్‌తో ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీలు బ్యాటరీ బ్యాక్ అప్, ఫాస్ట్ ఛార్జింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వినియోగదారులు కూడా తమ ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు రావడంతో పాటు వేగంగా బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా ఉండే ఫోన్‌‌లపై ఆసక్తి చూపుతున్నారు.
 
అయితే తాజాగా ఇన్ఫీనిక్స్‌ సంస్థ తీసుకొస్తున్న ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీ అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో బ్యాటరీ ఫుల్ అయ్యేలా కొత్త స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. 
 
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 10 నిమిషాల వ్యవధిలోనే 100 శాతం ఛార్జ్‌ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. 160 వాట్ అల్ట్రా ఫ్లాష్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది.
 
ఈ ఫోన్ ఫాస్ట్‌ ఛార్జింగ్ కోసం సూపర్‌ ఛార్జ్‌ పంప్‌ను అభివృద్ధి చేయగా… ఛార్జింగ్ సమయంలో యూఎస్‌బీ-సీ పోర్ట్‌ నుంచి వస్తున్న వోల్టేజ్‌లో మార్పులు చేసి వేగంగా ఛార్జ్‌ అయ్యేలా చేస్తుంది. అలానే ఈ ఫోన్‌ 50 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని ఆ సంస్థ తెలిపింది. 

ఈ కాన్సెప్ట్ ఫోనులో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. వెనుకవైపు మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నట్టు తెలిపింది. అలానే ఈ ఫోను 50 వాట్ వైర్‌లెస్ చార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ప్రయోగాల దశలో ఉండగా… త్వరలోనే మార్కెట్లోకి విక్రయానికి రానుంది.