శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

ఆపిల్ ఫ్యామిలీ నుంచి మరో కొత్త ఫోన్.. విడుదల ఎపుడంటే?

iPhoneSE4
ఆపిల్ కుటుంబం నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్‌లోకిరానుంది. ఐఫోన్ ఎస్ఈ 4 పేరుతో దీన్ని తయారు చేశారు. ఈ ఫోన్ ఇతర ఐఫోన్లతో పోల్చితే తక్కువ ధరకే లభ్యమవుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 19వ తేదీన ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఆయన ప్రత్యేకంగా ఐఫోన్ ఎస్ఈ 4 పేరును ప్రస్తావించనప్పటికీ కొత్తగా లాంఛయ్యే ప్రొడక్ట్ ఇదే అని టెక్ వర్గాలు స్పష్టం చేశాయి. 
 
కాగా, ఐఫోన్ ఎస్ఈ-4 ధర కూడా తక్కువగానే ఉండొచ్చని సమాచారం. ఐఫోన్ కొత్త మోడల్ ఏదైనా ఆవిష్కరిస్తుంటే భారత్‌లోని ఆపిల్ స్టోర్ల వద్ద కొనుగోలుదారుల హంగామా మామూలుగా ఉండటం లేదు. అర్థరాత్రి నుంచే గాడ్జెట్ ప్రియులు ఆపిల్ స్టోర్ల వద్ద బారులు కనిపిస్తుంటారు. 
 
ఐపీఎల్ 2025 సీజన్ : మార్చి 29న తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో? 
 
ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్‌కు సంబంధించి క్రికెట్ బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం తొలి మ్యాచ్‌ను మార్చి 30వ తేదీన కోల్‌కతా నగరంలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. మే 25వ తేదీన ఈడెన్ గార్డెన్స్‌లోనే ఫైనల్ మ్యాచ్ కూడా నిర్వహించనున్నట్టు ఆ కథనంలో పేర్కొంది. 
 
బీసీసీఐ అంతర్గత వర్గాల సమాచారం మేరకు తొలి మ్యాచ్‌ ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 22న కోల్‌కతాలో నిర్వహించనున్నారు. గత యేడాది రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాత రోజు మధ్యాహ్నం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఇక మే 25వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. 
 
అలాగే, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగుళూరు, లక్నో, ముల్లాన్‌పూర్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలతో పాటు గౌహతి, ధర్మశాల ప్రాంతాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది.
 
మార్చి 26, 30వ  తేదీల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హోం మ్యాచ్‌లు గౌహతి వేదిగా జరిగే అవకాశం ఉందని తెలిపింది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లలో ఆర్ఆర్‌తో పోటీ పడుతాయని పేర్కొంది. అలాగే, ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టు రెండు హోం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. 
 
కాగా, జనవరి 12వ తేదీన ముంబైలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హాజరైన ఐసీసీ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ మార్చి 23వ తేదీన ఈ యేడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుందని సూచన ప్రాయంగా వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే, బీసీసీఐ ఉన్నతస్థాయి వర్గాలు మాత్రం ఈ యేడాది ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 23వ తేదీన ప్రారంభం కాదని స్పష్టం చేశారు.