శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 జులై 2022 (18:57 IST)

వన్ ప్లస్ నోర్డ్ 2టి5G: వన్ ప్లస్ ఎసెన్షియల్స్ అప్ గ్రేడ్ అయ్యాయి

One plus
అంతర్జాతీయ టెక్నాలజీ బ్రాండ్ అయిన వన్ ప్లస్ నేడిక్కడ వన్ ప్లస్ నోర్డ్ 2టి5Gను ఆవిష్కరించింది. కంపెనీ అత్యంత అందుబాటు స్మార్ట్ ఫోన్ శ్రేణి- వన్ ప్లస్ నోర్డ్ కు ఇది తాజా జోడింపు. వన్ ప్లస్ నోర్డ్ 2టి అనేది అంతా ఎంతగానో అభిమానించిన వన్ ప్లస్ నోర్డ్ 2 ఎసెన్షియల్స్ ను స్వీకరించింది. అంతేగాకుండా యూజర్లకు మరింతగా ఎలివేటెడ్ అనుభూతులను అందించేందుకు వాటిని భారీగా అప్ గ్రేడ్ చేసింది.


వన్ ప్లస్ 10 ప్రొలో మొదటగా ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ 80W సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌నే వన్ ప్లస్ నోర్డ్ 2టి ప్యాక్స్ కూడా ఉపయోగిస్తున్నాయి. వేగవంతమైన, మృదువైన అనుభూతిని అందించేందుకు వీలుగా ఇది వేగవంతమైన, సమగ్రంగా అప్ గ్రేడ్ చేయబడిన మీడియా టెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్‌తో వస్తుంది. వన్ ప్లస్ 10ఆర్ నుంచి మెరుగు పర్చబడిన ఏఐ ఫ్లాగ్ షిప్ కెమెరాను కలిగిఉంటుంది. దాంతో పాటుగా ఆక్సీజన్ ఒఎస్ 12.1 ఉంటుంది. 
 
ఈ సందర్భంగా వన్ ప్లస్ వ్యవస్థాపకులు పెటె లావ్ మాట్లాడుతూ, ‘‘వన్ ప్లస్ అనుభూతిని మరింత యా క్సెసబుల్ చేయాలన్న మా కట్టుబాటుకు అనుగుణంగా వన్ ప్లస్ 2టి అనేది చక్కటి హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను సమ్మిళితం చేస్తుంది. ఒక గొప్ప ఎవ్రీడే స్మార్ట్ ఫోన్ హద్దులను మరింతగా అధిగమించింది’’ అని అన్నారు. ‘‘అత్యున్నత శ్రేణికి చెందిన హార్డ్ వేర్‌తో పాటుగా 80W సూపర్ వూక్, మీడియా టెక్ డైమెన్సిటీ 1300 చిప్ సెట్, సోనీ IMX766 ఇమేజ్ సెన్సర్, ఆక్సీజన్ ఒఎస్ 12.1 వంటి  సాఫ్ట్ వేర్  అంశాలను కూడా కలిగిఉంది. వీటన్నింటితో అందుబాటు ధర అంశం కన్నా మరింత ప్రీమియం అనే భావనను ఇది అంది స్తుంది’’ అని అన్నారు.  
 
ధర మరియు లభ్యత
భారతదేశంలో వన్ ప్లస్ నోర్డ్ 2టి5G విక్రయాలు జులై 5 మధ్యామ్నం 12 గంటల నుంచి వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్.ఇన్, వన్ ప్లస్ ఎక్స్ పీరియెన్స్ స్టోర్స్ మరియు అధీకృత పార్ట్ నర్ స్టోర్స్ లో ప్రారంభం కానున్నాయి. ఈ ఉపకరణం వెల రూ. 28,999ల నుంచి ప్రారంభమవుతుంది.