శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (15:10 IST)

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్-ధర-16,990

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. ఒప్పో ఎ7 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదలైంది. ఈ ఫోన్ 6.2 ఇంచ్‌ల భారీ డిస్‌ప్లేను కలిగివుంటుంది. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరాలు రెండు, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వున్నాయి. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఈ ఫోను గ్లేరింగ్ గోల్డ్, గ్లేజ్ బ్లూ కలర్ వేరియెంట్లలో విడుదలైంది. ఒప్పో ఎ7 స్మార్ట్ ఫోన్ రూ.16,990 ధరకు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ సైట్లో వచ్చే వారం నుంచి వినియోగదారులకు అందుబాటులో వుంటుంది. 
 
ఫీచర్స్ సంగతికి వస్తే.. 
64 జీబీ స్టోరేజ్, 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
డ్యుయల్ సిమ్ 
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 
బ్లూటూత్ 4.2, 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ను కలిగివుంటుంది.