శుభవార్త చెప్పిన ఫోన్ పే... ఇక విదేశాల్లోనూ యూపీఐ సేవలు
ఫోన్ పే శుభవార్త చెప్పింది. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫోన్ పే ప్రకటించింది. ఫలితంగా అంతర్జాతీయంగానూ యూపీఐ సేవలను తీసుకొచ్చింది. ఈ సేవల వల్ల భారతీయులు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు నగదు మార్పిడి చేసుకోవాల్సిన అవసరం వుండదు. భారతీయ బ్యాంకు ఖాతా ద్వారా నేరుగా నగదు చెల్లింపులు చేసుకోవచ్చు.
విదేశాల్లో యూపీఐ చెల్లింపుల కోసం అనువైన సాంకేతికతను ఏప్రిల్ 30 లోపు సిద్ధం చేసుకోవాలని ఎన్‌పీసీఐ గత నెలలోనే ఫిన్‌టెక్ సంస్థలకు సూచించింది. ఇందులో భాగంగానే ఫోన్ పే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సేవల ద్వారా భారతీయులు అక్కడి వెళ్లినప్పుడు పేమెంట్స్ చేస్తే విదేశీ కరెన్సీ వారి బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. విదేశాల్లో ప్రయాణించే భారతీయులు అక్కడ చెల్లింపులు చేసేటప్పుడు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని, త్వరలోనే మరిన్ని దేశాలకు వీటిని విస్తరిస్తామని ఫోన్ పే ప్రకటించింది.