శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (18:08 IST)

పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్ ధరలు లీక్.. ఎంతో తెలుసా?

Poco F2 Pro Price
పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్ ధరలు లీకయ్యాయి. ఒక నివేదిక ప్రకారం పోకో ఎఫ్2 స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.53,300 ఉండనుంది. ఇదే స్పెసిఫికేషన్లతో ఉన్న రెడ్ మీ కే30 ప్రో స్మార్ట్ ఫోన్ ధర రూ.32,500 మాత్రమే ఉంది. అలాగే ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 749 సుమారు రూ.61,600 ఉండనుందని సమాచారం.

అయితే ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్ల గురించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఒకవేళ పోకో ఎఫ్2 ప్రో.. రెడ్ మీ కే30 ప్రో స్మార్ట్ ఫోన్ కు రీబ్రాండెడ్ వెర్షనే అయితే.. దీని ధర రెడ్ మీ కే30 ప్రో కంటే చాలా ఎక్కువనే చెప్పాలి.
 
పోకో ఎఫ్2 ప్రో స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. రీబ్రాండెడ్ వెర్షన్ కాబట్టి దాదాపుగా రెడ్ మీ కే30 ప్రో స్పెసిఫికేషన్లే ఉంటాయి. కాబట్టి పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్ ఫోన్ లో కూడా క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 5జీ కనెక్టివిటీ, వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి.