గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (16:22 IST)

రియల్ మీ నుంచి జీటీ5 ప్రో కొత్త స్మార్ట్‌ఫోన్

Realme GT5 Pro
Realme GT5 Pro
రియల్ మీ కంపెనీ నుంచి జీటీ5 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. 2023 చివరి నాటికి ఈ మోడల్ లాంచ్ అవుతుందని సమాచారం. అయితే లాంచ్ కాకముందే ఈ మోడల్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వీటితో పాటు కొన్ని టీజర్లను కూడా కంపెనీ విడుదల చేసింది. దీంతో ఈ గాడ్జెట్‌లోని కీలక ఫీచర్లపై క్లారిటీ వచ్చింది.
 
ఈ రియల్ మీ GT5 ప్రోలో 50MP Sony Lytia LVT808 ప్రైమరీ, 50MP Sony IMX890 టెలిఫోటో మరియు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా రాబోతోందని టాక్. 
 
ఈ Realme కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉండవచ్చు. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంది. ఈ మోడల్ 161.6×75.1×9.2mm కొలతలో వస్తుంది. దీని బరువు 220 గ్రాములు అని సమాచారం. అయితే ఈ మోడల్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇండియా లాంచ్ ఇంకా వెల్లడి కాలేదు.