సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (14:32 IST)

రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. ప్రారంభ ధర రూ.16,999

రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. రియల్‌మీ ఎక్స్‌2 మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్ కలిగివుంటుంది. ప్రారంభ ధర రూ.16,999.
 
రియల్‌మీ ఎక్స్‌2 సేల్ డిసెంబర్ 20 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అవుతుంది. రియల్‌మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ బడ్స్ ఎయిర్‌ను కూడా లాంఛ్ చేసింది కంపెనీ. రియల్‌మీ బడ్స్ ఎయిర్‌ ధర రూ.3999. ఫ్లిప్‌కార్ట్‌లో హేట్ టు వెయిట్ సేల్ మొదలైంది. డిసెంబర్ 23న మొదటి సేల్ ఉంటుంది. ఇక దీంతో పాటు రియల్‌మీ యూజర్ ఇంటర్‌ఫేస్‌ని కూడా ప్రకటించింది కంపెనీ. జనవరిలో రియల్‌మీ యూఐ అందుబాటులోకి రానుంది.  
 
తాజాగా విడుదలైన రియల్ మీ ఎక్స్ టు ఫీచర్స్ 
30డబ్ల్యూ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్ 4.0,
సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 
32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజైంది.