1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (15:41 IST)

Redmi Note 13 సిరీస్ 5జీ సిరీస్.. భారత్‌లో రిలీజ్ ఎప్పుడంటే?

Redmi Note 13
Redmi Note 13
Redmi Note 13 సిరీస్ ఫోన్‌లు జనవరి 4న భారతదేశ మార్కెట్లోకి రానున్నాయి. ఈ సిరీస్‌లో రెడ్ మీ నోట్ 13, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ ఉన్నాయి. 
 
రెడ్ మీ నోట్ 13 సిరీస్‌లోని అన్ని ఫోన్‌లు 5G టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్లు 6.67 అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తాయి .రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్ మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడల్‌లు 1.5K డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 
 
అలాగే, ప్రో ప్లస్ వేరియంట్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, నోట్ 13 మీడియా టెక్ డైమెన్షన్ 6080 SoC చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. Note 13 Proలో Snapdragon 7S Gen 2 ఉంది. Note 13 Pro Plusలో MediaTek డైమెన్షన్ 7200 Ultra SoC ఉంది.
 
రెడ్‌మి నోట్ 13 సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అలాగే, 100 MP ప్రైమరీ సెన్సార్, 2 MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. Redmi Note 13 Pro, Redmi Note 13 Pro + ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. 
 
Redmi Note 13 Pro మోడల్‌లు Samsung HP3 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌తో కూడిన 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్నాయి. భారతదేశంలో Redmi Note 13 సిరీస్ ధరలు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు.