శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (15:16 IST)

దెబ్బకు దిగివచ్చిన జియో... ఆల్ ఇన్ వన్ ప్లాన్స్‌తో ప్రత్యర్థులకు చెక్

దేశంలో టెలికాం సంచలనం రిలయన్స్ జియో.. ఎట్టకేలకు దిగివచ్చింది. ఐయూసీ కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామంటూ ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటనపై జియో మొబైల్ వినియోగదారుల నుంచి తీవ్రవ్యతిరేక వచ్చింది. పైగా, ప్రత్యర్థి కంపెనీలు ఏవీ కూడా ఈ తరహా ఐయూసీ చార్జీలను వసూలుకు ఆసక్తి చూపలేదు. దీంతో రిలయన్స్ జియో దిగివచ్చి, మూడు సరికొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ పేరుతో దీన్ని పరిచయం చేసింది. 
 
ఈ ప్లాన్స్ కింద రోజుకు 2 జీబీడేటాను అందివ్వనుంది. ప్రధానంగా ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటే జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం కల్పించింది. 
 
ఈ  కొత్త ప్లాన్స్‌ ఒక నెలకు రూ.222, 2 నెలలకు రూ.333, 3 నెలలకు రూ.444లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. తమ కొత్త ప్లాన్స్‌ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. 
 
జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను  రూ.111తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 3 నెలల 2 జీబీ ప్యాక్(రూ.448) తో పోలిస్తే.. రూ.444 మాత్రమే ఖర్చు అవుతుంది.  రూ.396 (198x2) ప్లాన్స్‌లో మునుపటి ఖర్చుతో పోలిస్తే ఇపుడు రూ.333  మాత్రమే ఖర్చవుతుందని, అలాగే అదనంగా 1,000 నిమిషాల ఐయూసీ వాయిస్ కాల్స్‌ ఉచితమని జియో తెలిపింది. విడిగా దీన్ని  కొనాలంటే 80 రూపాయలు వినియోగదారుడు వెచ్చించాల్సి వస్తుందని జియో వెల్లడించింది.