రిలయన్స్ జియో దీపావళి షాక్.. ఏంటో తెలుసా?
దీపావళి పండుగ రోజున రిలయన్స్ జియో తమ యూజర్లకు తేరుకోలేని షాకిచ్చింది. 84 రోజుల రూ.399 ప్లాన్‌ను రూ.459కు పెంచుతున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్‌లో ఈ విషయాలను తెలిపింది. ఈ టారిఫ్‌ల సవరింపు దీపావళి నుం
దీపావళి పండుగ రోజున రిలయన్స్ జియో తమ యూజర్లకు తేరుకోలేని షాకిచ్చింది. 84 రోజుల రూ.399 ప్లాన్‌ను రూ.459కు పెంచుతున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్‌లో ఈ విషయాలను తెలిపింది. ఈ టారిఫ్‌ల సవరింపు దీపావళి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
84 రోజుల ప్లాన్‌లో వినియోగదారులు 1 జీబీ 4జీ డేటాను ప్రతిరోజూ పొందవచ్చని వివరించింది. దివాళీ ధమాకా పేరుతో అందిస్తున్న స్కీమ్‌లో రూ.149 ప్లాన్‌లో ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న డేటాను 2జీబీ నుంచి 4జీబీకు పెంచుతున్నామని పేర్కొంది.
అయితే, షార్ట్ టర్మ్ ప్లాన్‌లు, తక్కువ డినామినేషన్ రీచార్జ్ టారిఫ్‌లను రిలయన్స్ జియో తగ్గించింది. ఏడు రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ రూ.52, రెండు వారాల వ్యాలిడిటీ ఉండే రూ.98 ప్లాన్‌లో ఉచిత వాయిస్, ఎస్‌ఎంఎస్, అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చని పేర్కొంది.
రోమింగ్‌లో ఉన్నప్పటికీ, జియో… అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.509 స్కీమ్ ప్రయోజనాలను తగ్గించింది. అంతేకాకుండా బిల్లింగ్ సైకిల్‌ను 56 రోజుల నుంచి 49కు తగ్గించామని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక రూ.999 ప్లాన్‌లో గతంలో ఆఫర్ చేసిన 90 జీబీ 4 జీ డేటాను 30 జీబీకి తగ్గించింది.