రోపోసో, ప్రతి భారతీయుడి 'టీవీ బై ది పీపుల్' యాప్, ఇప్పుడు తెలుగులో...

హైదరాబాద్ : భారతదేశం మొట్టమొదటి డిజిటల్ ప్లాట్ఫారమ్ రోపోసో - "టీవీ బై ది పీపుల్", భారతదేశం యొక్క అత్యంత అభిమానించే సోషల్ మీడియా - అప్లికేషన్‌గా అభివృద్ధి చెందడంలో ఒక పెద్ద ముందడుగు వేసింది. ఈ యాప్ ఇప్

Roposo
ivr| Last Updated: శుక్రవారం, 8 డిశెంబరు 2017 (21:16 IST)
హైదరాబాద్ : భారతదేశం మొట్టమొదటి డిజిటల్ ప్లాట్ఫారమ్ రోపోసో - "టీవీ బై ది పీపుల్", భారతదేశం యొక్క అత్యంత అభిమానించే సోషల్ మీడియా - అప్లికేషన్‌గా అభివృద్ధి చెందడంలో ఒక పెద్ద ముందడుగు వేసింది. ఈ యాప్ ఇప్పుడు తెలుగు మరియు ఇతర 7 భాషలలో ఇప్పుడు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇంతకుముందు ఆంగ్లంలో అందుబాటులో ఉండగా, ఇప్పుడు హిందీ, మరాఠీ, గుజరాతి, పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలను జోడించి యాప్‌ని అందరికి అందిస్తుంది. తద్వారా, రోపోసో దేశంలోని మరింత మంది వినియోగదారులకు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు.

ముఖ్యంగా టైర్ -2 మరియు టైర్ -3 నగరాలపై దృష్టిగా ఈ సేవలను అందిస్తుంది. రోపోసో ఏకైక భావన వారి విభిన్న కథలను ఒక ఆకర్షణీయమైన మరియు యూజర్ ఫ్రెండ్లీ పద్ధతిలో ప్రసారం చేయడం ద్వారా కంటెంట్‌ను ఒకేసారి సృష్టించడానికి మరియు చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మూడు నెలలు క్రితం పునరుద్ధరించబడినప్పటి నుంచే, సోషల్ మీడియా ప్లాట్ఫాం దాని వినియోగదారులచే సృష్టించబడిన తెలుగు కంటెంట్లో 67.62% పెరుగుదలను చూసింది.

ఈ పెరుగుతున్న నూతన ఒరవడి దృష్ట్యా, రాపోసోను తెలుగు కమ్యూనిటీకి మరింత దగ్గర చేస్తూ, ప్రోత్సహించడానికి తెలుగులో యాప్‌ను ప్రారంభించింది. మా యొక్క ఈ సోషల్ ప్లాట్ఫాం పాన్-ఇండియా వినియోగదారులను కోసం ఉద్దేశించిన ఒక యాప్‌గా మంచి పేరును నమోదు చేసుకున్నది. ఎనిమిది ప్రాంతీయ భాషల పరిచయంతో,
మేడ్-ఇన్-ఇండియా-ఫర్-ఇండియా ఇమేజ్‌కు రోపోసో తోడ్పడుతూ, రోపోసో వేదికపై తమను వ్యక్తం చేయడానికి దేశం యొక్క మారుమూల ప్రాంతాల నుండి వినియోగదారులను కూడా ప్రోత్సహిస్తుంది. మరిన్ని భాషల పరిచయంతో, వారి కంటెంట్‌ను అనువాదంలో లేని కారణంగా కోల్పోకుండా రోపోసో వినియోగదారులు వారి ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను ఒకరితో ఒకరు పంచుకోగలరు.

ఈ సందర్భంగా సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు - మాయాన్క్ భంగాడియా మాట్లాడుతూ... భారతీయ భాషలు వారి ఆహ్లాదకరమైన టోన్, రిథమ్ మరియు స్వాభావిక హాస్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మేము మా ప్రాంతీయ భాషలకి నిజంగా గర్వంగా ఉన్నాము మరియు ఏ ఇతర భాషచే సంపూర్ణ భావోద్వేగాలను సంగ్రహించలేని కొన్ని భావాలు ఉన్నాయి. అనువాదం తర్వాత, మా యాప్ యొక్క ఫీచర్లు కూడా తమ ప్రాంతం యొక్క భాషలో మాత్రమే సౌకర్యవంతంగా ఉన్నవారికి కూడా అర్థం చేసుకోవడానికి సులభంగా మారాయి.

మేము ఈ తాజా ప్రకటనతో, దేశంలోని అన్ని ప్రాంతాల నుండి #Desi కథల యొక్క అనేక శాఖలకు మేము ద్వారాలు తెరిచామని నమ్ముతున్నాము! ఇది రోపోసో వేదికను గణనీయంగా మెరుగుపరుస్తుంది, ఇది మన దేశంలోని పలు భాషల్లోని ప్రత్యేకమైన అనుభవాలను పంచుకుంటుంది మరియు దేశంలో మొత్తం మా యొక్క యాప్‌కు జనాదరణను పెంచుతుంది." అని అన్నారు.

ఈ ఇనిషిటేవ్‌కు మద్దతుగా, నటి మరియు రోపాసో వినియోగదారుడు, స్నేహ ఉల్లాల్ ఈ విధంగా అన్నారు, "ఇండియన్ స్ఫూర్తిని ఒక యాప్‌ఎలా ఉత్తమంగా నిర్వచించగలదు. మనము వివిధ భాషలను గౌరవించే ఒక దేశంలో ఉన్నాము కనుక ఈ యాప్ అందరికీ ఎంతో వుపయోగపడుతుంది". వినూత్న వినియోగదారుల ఎంగేజ్మెంట్ వ్యూహాలను కాకుండా, ప్రత్యేకమైన వినియోగదారు అనుభవాన్ని సృష్టించడానికి తాజా టెక్నాలజీని పరిచయం చేయడంలో రోపోసో ఎల్లప్పుడూ ఒక మార్గదర్శకుడు. దీని తాజా 'టీవీ బై ది పీపుల్' అవతార్ ద్వారా, దాని వినియోగదారులను హ్యాండ్స్-ఫ్రీ స్క్రోలింగ్ మరియు పూర్తి స్క్రీన్ వీక్షణతో ప్రత్యేకమైన TV వంటి బ్రౌజింగ్ అనుభవాన్ని అందించే ప్లాట్ఫారమ్‌ను అందించింది. తాజాగా ఈ
ప్రాంతీయ భాషల సంస్కరణలతో కూడిన ఈ టెక్నాలజీ ద్వారా, భారతదేశపు అత్యంత ప్రాధాన్యత కలిగిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి చెందడానికి తన దృష్టిని సాధించడంలో రాపోసో నిస్సందేహంగా పని చేస్తుంది.

రోపోసో గురించి :
రోపోసో - టీవీ బై ది పీపుల్ అనేది ఇంట్లో తీసిన వీడియోలను మరియు ఫోటోలతో వ్యక్తులకు దృశ్యపరంగా వ్యక్తం చేసే ఏకైక వేదిక. వినియోగదారులు సృష్టించిన ఛానళ్లతో అవాంతరాలు లేని బ్రౌజింగ్ అనుభవాన్నిఈ యాప్ అందిస్తుంది.
వినియోగదారులు వారికి సంబంధించినది మరియు అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రేక్షకులతో కనెక్ట్ కాగలరు. దాని ఆసక్తికరమైన పోస్ట్ క్రియేషన్ టూల్స్ మరియు ఎడిటింగ్ టూల్స్‌తో, వినియోగదారులు తమ జీవితాలను పంచుకోగలరు, వారిలోని తెలియని ప్రతిభ ప్రదర్శించడానికి, మరియు ముఖ్యమైన విషయాలపై వారి అభిప్రాయాన్ని వినిపించవచ్చు.

దేశ వ్యాప్తంగా తమకు ఉన్నా 4.5 మిలియన్ వినియోగదారుల ఆధారంతో నైపుణ్యం కలిగిన గృహ అమ్మకందారులకు రాపోసో ఒక మంచి వ్యాపారవేదికను అందిస్తుంది. రోజుకు 4 మిలియన్ల స్క్రీన్ వీక్షణలు మరియు నెలలో 4,50,000 పోస్టులు, ఈ వెంచర్ ఇండియన్ డిజిటల్ స్పేస్‌లో ఒక సముచిత ఆటగాడిగా స్థిరపడింది. గుర్గావ్లో ఉన్న ప్రధాన ఇ-సొల్యూషన్స్ బ్రాండ్, రోపోసో ముగ్గురు ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్ధులు, మాయాన్క్ భంగాడియా, అవినాష్ సక్సేనా మరియు కౌసల్ షుబ్బాంక్‌చే ప్రారంబించబడినది .దీనిపై మరింత చదవండి :