శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ఎమ్-సిరీస్ స్మార్ట్ ఫోన్లు.. అమేజాన్‌లో?
శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ఎమ్10, గ్యాలెక్సీ ఎమ్20 స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి. గ్యాలెక్సీ ఎమ్-సిరీస్ ఫోన్లను శామ్ సంగ్ సోమవారం విడుదల చేయనుంది. శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ల కోసం వినియోగదారులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ శామ్‌సన్ గ్యాలెక్సీ ఎమ్-సిరీస్ ఫోన్లలో యువతను ఆకట్టుకునే రీతిలో అత్యధిక సామర్థ్యంతో కూడిన బ్యాటరీలు, కెమెరాలు, డిస్‌ప్లేలు, ప్రోసెసర్లు వున్నాయి.
శామ్‌సంగ్ గ్యాలెక్సీ ఎమ్-సిరీస్ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు విడుదల కానుంది. అమేజాన్ ఇండియా వెబ్‌సైట్లో ఈ ఫోన్‌ను పొందవచ్చు. ఈ రెండు ఫోన్లు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్10 ధర రూ.7,990, 2జీబీ రామ్, 16జీబీ స్టోరేజ్ మోడల్‌లో ఇది లభ్యమవుతుంది.
ఇక 3జీబీ, 32జీబీ స్టోరేజ్ మోడల్ గెలాక్సీ ఎమ్20 ధర రూ.8,990 వుంటుంది. గెలాక్సీ ఎమ్20 ధర మాత్రం భారత్‌లో రూ.10,990 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 3జీబీ/32జీబీ స్టోరేజ్‌ను కలిగివుంటుంది. అలాగే 4జీబీ, 64జీబీ మోడల్ రూ.12,990 వరకు పలుకుతుందని శామ్‌సంగ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్10 ఫీచర్స్
శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్10 ఆండ్రాయిడ్ 8.1 ఓరియోను కలిగివుంటుంది.
స్పోర్ట్ 6.2 ఇంచ్ హెచ్డీ ప్లస్ (720x1520 పిక్సెల్) డిస్‌ప్లే
2జీబీ.. 3జీబీ రామ్ ఆప్షన్స్,
డుయెల్ రియల్ కెమెరా,
3,400 ఎంఎహెచ్ బ్యాటరీ
160 గ్రాముల బరువును ఈ ఫోన్ కలిగివుంటుంది.
గ్యాలెక్సీ ఎమ్20 ఫీచర్స్..
6.13 ఇంచ్‌ల డిస్‌ప్లే
ఓక్టా-కోర్ ప్రోసెసర్
8- మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
3జీబీ రామ్
ఓఎస్ ఆండ్రాయిడ్
13 మెగాపిక్సల్ ప్లస్ 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా,
5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ ఫోన్ కలిగివుంటుంది.