శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:50 IST)

రెడ్‌మీ నోట్7కు పోటీగా.. శామ్‌సంగ్ నుండి గెలాక్సీ ఎ20

చైనీస్ మొబైల్ దిగ్గజం షియోమీ రెడ్‌మీ నోట్7 మరియు రియల్‌మీ యూ1లకు పోటీగా శామ్‌సంగ్ ప్రవేశపెట్టిన గెలాక్సీ ఎ20 శుక్రవారంనాడు భారత్‌లో విడుదలైంది. వచ్చే వారం నుండి ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కాగా... 3జీబీ ర్యామ్+32 జీబీ సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభించే ఈ ఫోన్‌ ధర రూ.12,490గా ఉంది. 
 
ఇక స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే..
 
డిస్‌ప్లే : 6.4 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, వాటర్‌ డ్రాప్ నాచ్, ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే డిజైన్, 
ప్రాసెసర్ : ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ఎస్ఓసీ
ర్యామ్ : 3జీబీ ర్యామ్, 
ఇంటర్నల్ స్టోరేజీ : 32 జీబీ ఆన్‌బోర్డు స్టోరేజీ, 
ఎక్స్‌టర్నల్ స్టోరేజీ : 512జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు
బ్యాటరీ : 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 
కెమెరాలు : 13 ఎంపీ + 5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉండగా,
 
వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.