సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (10:42 IST)

భారత్‌లో అతి తక్కువ చౌక ధరతో స్మార్ట్ టీవీ.. రూ.4,999 మాత్రమే

భారత్‌లో అతి తక్కువ చౌక ధర కలిగిన స్మార్ట్ టీవీని ఢిల్లీకి చెందిన సామీ ఇన్ఫర్మాటిక్స్ అనే కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టీవీ ధర రూ.4,999 మాత్రమే. సాధారణంగా 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అంటే తొమ్మిది వేల నుంచి రూ.12వేల మధ్య వుంటుంది. కాస్త చిన్న సైజ్ టీవీ అయితే రూ.15వేల వరకు వుంటుంది. 
 
అయితే తాజాగా ఢిల్లీ కంపెనీ విడుదల చేసిన ఈ టీవీలో 1366×786 హెచ్డీ రిజల్యూషన్, 10 వాట్ స్పీకర్స్, 512 జీబీ స్టోరేజ్, ఎస్ఆర్‌ఎస్‌ డాల్బీ డిజిటల్‌, 5 బ్యాండ్‌) ఇన్‌ బిల్ట్‌ వైఫై కనెక్టివీటీ, స్క్రీన్‌ మిర్రరింగ్‌ సౌకర్యాలుంటాయని, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌ వినియోగించుకోవచ్చు. ఇంకా రూ.4,999కే 32 అంగుళాల టీవీ లభిస్తోంది. 
 
ఈ టీవీని పేదల కోసమే రూపొందించినట్లు సామీ ఇన్ఫర్మాటిక్స్ కంపెనీ అధికారులు తెలిపారు. ఈ టీవీ ఆండ్రాయిజ్ 4.4 కిటిక్యాట్‌తో పనిచేస్తుంది. 2హెచ్డీఎమ్ఐ 2 యూఎస్‌‌బీ పోర్ట్స్‌ను కలిగివుంటుంది. రెండు 10డబ్ల్యూ స్పీకర్‌ను ఇది కలిగివుంటుంది. ఈ టీవీని ఆర్డర్ చేయాలన్నా.. కొనుగోలు చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి.