శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (17:52 IST)

రూ. 8,999లకే లభించనున్న టెక్నో స్పార్క్ 30సి

Tecno Spark 30C 5G
Tecno Spark 30C 5G
ప్రముఖ టెక్ బ్రాండ్ టెక్నోకి మార్కెట్‌లో క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. తాజాగా టెక్నో మరో మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్‌ స్పార్క్ 30సి అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. 
 
ఇది అద్భుతమైన 48ఎంపీ ప్రధాన కెమెరా సెటప్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ప్రీమియం డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ది బెస్ట్‌ మొబైల్‌గా చెప్పొచ్చు. ఈ మొబైల్‌లో జీయోతో పాటు ఎయిర్‌టెల్‌తో కూడిన సిమ్‌లను వినియోగించేవారికి అద్భుతమైన స్పీడ్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉంటుంది. 
 
అంతేకాకుండా అతి తక్కువ బడ్జెట్‌లో ఈ మొబైల్‌ అందుబాటులోకి రావడం చాలా వల్ల చాలా బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌కి పోటీగా నిలవబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 8,999లకు పైగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.