వాట్సాప్‌తో ఇబ్బంది లేదు.. ప్రైవసీ డేటాకు ఢోకా లేదు
ప్రైవసీ పాలసీని మారుస్తూ, పేరెంట్ కంపెనీ అయిన ఫేస్ బుక్‌తో వాట్సాప్ డేటాని పంచుకుంటామని వాట్సాప్ తెలియజేయడంతో యూజర్లందరూ వాట్సప్ నుండి వైదొలుగుతున్నారు. దాంతో టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకి గిరాకీ బాగా పెరుగుతుంది. రానున్న రోజుల్లో 18శాతం మాత్రమే వాట్సాప్ ని కంటిన్యూ చేస్తారని, 15శాతం మంది పూర్తిగా మానేసారని, పూర్తిగా 36శాతం వాడకం తగ్గిందని లోకల్ సర్కిల్స్ చేసిన సర్వేలో వెల్లడైంది.
మొత్తం 8977మందిపై చేసిన ఈ సర్వేలో ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి. 2 బిలియన్లకి పైగా వాట్సాప్ యూజర్లున్న ప్రపంచానికి, ఫేస్ బుక్ యాజమాన్యం, వాట్సాప్ ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని, కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని ఫిబ్రవరి 8వ తేదీ నుండి అమల్లోకి రానుందని తెలిపింది. ఈ ప్రకటకపై తీవ్ర విమర్శలు రావడంతో వాట్సాప్ వెనక్కి తగ్గి 2021, మే 15వ తేదీ వరకు అలాంటి ఆలోచన లేదని విరమించుకుంది.
ప్రస్తుతం స్టార్ట్ అప్ కంపెనీస్ అన్నీ సిగ్నల్ యాప్‌పై ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ మేరకు వాట్సాప్ యాజమాన్యం, ప్రైవసీ గురించి చెబుతూ, మీకెలాంటి ఇబ్బంది ఉండదని, మీరు చేసిన చాట్స్, మీ ఫ్రెండ్స్ చేసిన చాట్స్‌కి భద్రత ఉంటుందని తెలుపుతుంది.