ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి

వాట్సాప్ వద్దే వద్దు బాబోయ్.. విపరీతంగా డౌన్‌లోడ్లు పెరిగపోతున్నాయ్

వాట్సాప్ వద్దే వద్దు బాబోయ్.. అంటున్నారు కస్టమర్లు. వాట్సాప్ వ్యక్తిగత గోప్యతా విధానంపై మొదలైన వివాదం... దాని ప్రత్యర్థులకు వరంగా మారింది. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో సిగ్నల్‌, టెలిగ్రాంల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయి. ఈ నెల 5 నుంచి 12 మధ్య గూగుల్‌, యాపిల్‌ స్టోర్ల నుంచి కోటి 78 లక్షల మంది సిగ్నల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 
 
అంతకుముందు వారం 2 లక్షల 85 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సిగ్నల్‌ తరహాలోనే టెలిగ్రాం యాప్‌కి సైతం గిరాకీ పెరిగింది. ఈ నెల 5 నుంచి 12 మధ్య కోటి 57 లక్షల మంది టెలిగ్రామ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అంతకు ముందు వారం 77 లక్షల డౌన్‌లోడ్లతో పోలిస్తే ఇది రెట్టింపు.
 
మరోవైపు... వివాదంలో చిక్కుకున్న వాట్స్‌యాప్‌ను వినియోగించే వాళ్ల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోతోంది. ఈ నెల 5 నుంచి 12 మధ్య కోటి డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. అంతుకు ముందు వారం కోటి 27 లక్షల డౌన్‌లోడ్లు జరగ్గా... వివాదం మొదలయ్యాయక 20 లక్షల డౌన్‌లోడ్లు తగ్గాయి. పరిస్థితిని చూస్తుంటే వినియోగదారులు ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మున్ముందు వాట్సాప్‌ వినియోగదారులు మరింత తగ్గే సూచనలున్నాయి.