వన్ టైమ్ ఆఫర్ కింద ఉచిత రీచార్జ్ : వొడాఫోన్ ప్రకటన
కరోనా కష్టకాలంలో తమ మొబైల్ వినియోగదారులను ఆదుకునేందుకు ప్రైవేట్ టెలికాం సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ సంస్థ ఉచిత రీచార్జ్‌ను ప్రకటించింది. అలాగే, జియో కూడా ప్రకటించింది. ఇపుడు వొడాఫోన్ వంతు వచ్చింది.
తమ 60 మిలియన్ల మంది అల్పాదాయ ఖాతాదారులకు 49 రీచార్జ్ ప్యాక్‌ను ఉచితంగా ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే, ఇది వన్ టైమ్ ఆఫర్ మాత్రమేనని చెప్పింది. ఈ ఆఫర్ ద్వారా ఏకంగా రూ 294 కోట్ల ప్రయోజనాలు వీఐ అల్పాదాయ ఖాతాదారులకు లభించనున్నాయి.
ఈ ఉచిత ఆఫర్‌తోపాటు రూ.79 రీచార్జ్ డబుల్ టాక్‌టైం కాంబో ఓచర్‌ను ప్రవేశపెట్టింది. కాగా, ఎయిర్‌టెల్ కూడా ఇటీవల తక్కువ ఆదాయం కలిగిన వారి కోసం ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించింది.
వీఐ ప్రకటించిన రూ.49 ఉచిత రీచార్జ్ ప్యాక్‌లో రూ.38 టాక్‌టైం, 300 ఎంబీ డేటా లభిస్తుంది. కాలపరిమితి 28 రోజులు. లోకల్/ఎస్టీడీ కాల్స్‌కు సెకనుకు రూ. 0.25 వసూలు చేస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన రూ.79 కాంబో రీచార్జ్‌లో రూ.64 టాక్‌టైం, 200 ఎంబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది.
ఆఫర్‌లో భాగంగా ఇప్పుడు రూ.128 టాక్‌టైమ్ లభిస్తుంది. మిగతా అన్నీ యథావిధిగా ఉంటాయి. అయితే, యాప్, వెబ్‌సైట్ ద్వారా రీచార్జ్ చేసుకున్న వారికి అదనంగా 200 ఎంబీ డేటా లభిస్తుందని వొడాఫోన్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.