ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జులై 2024 (19:16 IST)

భారత మార్కెట్లోకి వీవో నుంచి కొత్త ఫోన్లు.. ఫీచర్లేంటంటే?

Vivo V40 Series
Vivo V40 Series
వీవో నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. వివో నుంచి తన వీ40 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సంస్థ సిద్ధంగా వుంది. ఈ క్రమంలో మార్కెట్లోకి రెండు మోడల్స్ రానున్నాయి. Vivo V40, Vivo V40 Pro అనేవి కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.
 
వీటిలో వీవో V40 8 జీబీ రామ్, Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌తో లభిస్తుంది. ఈ హార్డ్‌వేర్ మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు అనువైనది. అలాగే 1260x2800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇది శక్తివంతమైన, పదునైన విజువల్స్‌ను అందిస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ వీక్షణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. స్క్రోలింగ్, గేమ్‌ప్లేను చాలా సెన్సిటివ్‌గా చేస్తుంది.
 
అలాగే Vivo V40 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లలో 5G, Wi-Fi 5, బ్లూటూత్ v5.4, ఎన్ఎఫ్‌సి USB టైప్-సి ఉన్నాయి. భద్రత కోసం, ఫోన్ ఆన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కాంతి, సామీప్యత, యాక్సిలరోమీటర్, కంపాస్, గైరోస్కోప్ వంటి ఇతర సెన్సార్‌లను కలిగి ఉంటుంది.