బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 మార్చి 2017 (08:33 IST)

రిలయన్స్ జియోకు షాకిచ్చిన వోడాఫోన్... మరో బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో దెబ్బకు దేశంలోని టెలికాం సంస్థలన్నీ కుదేలైపోతుంటే... వోడాఫోన్ మాత్రం జియోకు షాకిచ్చింది. తన వినియోగదారులు జియోకు మరలకుండా వొడాఫోన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

రిలయన్స్ జియో దెబ్బకు దేశంలోని టెలికాం సంస్థలన్నీ కుదేలైపోతుంటే... వోడాఫోన్ మాత్రం జియోకు షాకిచ్చింది. తన వినియోగదారులు జియోకు మరలకుండా వొడాఫోన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
 
నిజానికి జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ విలవిల్లాడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు భారీ ఎత్తున వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేసిన టెలికాం సంస్థలన్నీ జియో దెబ్బకు దిగివచ్చాయి. ఊహించని విధంగా ఆఫర్లను ఎరవేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 
 
ఈ నేపథ్యంలో నెలకు 346 రూపాయల రీచార్జ్‌‌పై 28 జీబీ 4 జీ డేటా, అపరిమిత కాల్స్, ఎస్‌ఎమ్మెస్‌‌లు లాంటి ప్రయోజనాలను అందించనుంది. అయితే ఈ ఆఫర్ మార్చి 15 వరకూ మాత్రమే చెల్లుబాటవుతుందని వోడాఫోన్‌ తన ప్రకటనలో తెలిపింది. 
 
జియో ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ కోసం వినియోగదారులు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. కానీ వోడాఫోన్‌ కస్టమర్లు ఇలాంటి ఫీజు లేకుండానే ఆ మంత్లీ ప్లాన్‌‌ని ఎంజాయ్‌ చేయొచ్చని వొడాఫోన్ తెలిపింది.