ఒక్క నెలలోనే 74 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
దేశంలోని కొత్త ఐటీ నిబంధనలు పాటించని కారణంగా ఆగస్టు నెలలో 74.2 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్టు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. జూలై నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా ఎక్కువగా ఉందని తెలిపింది. ఆగస్టు నెలలో నిషేధం విధించిన మొత్తం 35 లక్షల ఖాతాలపై ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్ తెలిపింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, వినియోదరాలు నుంచి అందిన ఫిర్యాదులు, వినతులు ఆధారంగా 72.28 లక్షల ఖాతాలోను నిషేధించగా, అందులో 3.1 లక్షలో ఖాతాలను ముందస్తు చర్యల్లో భాగంగా నిలిపివేసినట్టు పేర్కొంది.
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా చేస్తున్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ మేసేజింగ్ సర్వీసులో తాము అగ్రగామిగా ఉన్నట్టు వాట్సాప్ వెల్లడించింది. అంతేకాకుండా వాట్సాప్ యూజర్ల భద్రతపరంగా కూడా మెరుగైన చర్యలు సేవలు అందించేందుకు, ఫిర్యాదులను విశ్లేషించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వాట్సాప్ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అక్టోబరు నెలలో వెల్లడించిన నివేదికలో పేర్కొంది.