గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (15:36 IST)

వాట్సప్ చాట్స్‌ను హైడ్ చేయాలంటే..?

వాట్సాప్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్, సెట్టింగ్‌ల గురించి చాలామందికి చాలా వరకు తెలియదు. అందులో ఒకటి ఆర్కైవ్ ఫీచర్ ఒకటి. వాట్సప్ వాడే వినియోగదారులు వారి చాట్‌ను ఎవరికీ కనిపించకుండా హైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంతో అవసరమైన చాట్‌ను డిలీట్ చేయకుండానే, ఎవరికి కనిపించకుండా చేయవచ్చు అన్నమాట. మళ్ళీ కావాల్సినప్పడు అన్ హైడ్ చేసుకుని చాట్స్‌ కనిపించేలా చేస్కోవచ్చు.
 
అయితే వాట్సప్‌లో చాట్స్ ను ఆర్కైవ్ చేయాలంటే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత అర్చివ్ చేయాలనుకున్న చాట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. వాట్సాప్ కు పైన పిన్, మ్యూట్, డిలీట్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో కింద వైపు గుర్తుతో ఉన్న ఐకాన్ నో క్లిక్ చేస్తే ఆ చాట్ అర్చివ్ అవుతుంది. వాట్సాప్ లో మూడు లైన్స్ పైన క్లిక్ చేస్తే అర్చివ్ సెక్షన్ లో అర్చివ్ చేసిన చాట్లు కనిపిస్తాయి. 
 
ఈ సెట్టింగ్ ను ఉపయోగించి ఒకవేళ అర్చివ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే అన్ అర్చివ్ చేసుకోవచ్చు. అన్ అర్చివ్ చేసుకోవాలంటే స వాట్సాప్ స్క్రీన్ పైన అర్చివ్ గుర్తు కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేస్తే మీరు ఇంతకముంది అర్చివ్ చేసిన చాట్స్ అన్ని కన్పిస్తాయి. అందులో ఏదైతే అర్చివ్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే పైన కనిపించే అన్ అర్చివ్ గుర్తు మీద క్లిక్ చేస్తే మళ్ళీ చాట్స్ అన్ని కనిపిస్తాయి.