గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (18:53 IST)

వాట్సాప్‌ గ్రూపులో కొత్త ఫీచర్ - సైలెంట్‌గా గ్రూపు నిష్క్రమణ

whatsapp
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గ్రూపులో మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. వాట్సాప్ గ్రూపు నుంచి నిష్క్రమించినట్టుగా ఎవరికీ తెలియకుండా ఉండేలా ఓ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. వాట్సాప్ యూజర్ల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, గ్రూపు నుంచి నిష్క్రమించినట్టుగా గ్రూపు అడ్మిన్‌కు మాత్రమే మీరు గ్రూపు వీడినట్టు తెలుస్తుంది. 
 
యూజర్ల గోప్యతకు పెద్దపీట వేస్తూ వాట్సాప్ కొత్త ఫీచర్‌కు అభివృద్ధి చేస్తోంది. వాట్సాప్ డెస్క్ టాప్ బీటా వెర్షన్లలో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. త్వరలోనే వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్‌ల రూపంలోనూ ఈ ఫీచర్‌పై పరిశీలన చేపట్టనున్నట్టు తెలుస్తోంది.