బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:05 IST)

బీటెక్ విద్యార్థులకు శుభవార్త: 30,000 మంది ఫ్రెషర్స్‌కి ఆఫర్ లెటర్స్

బీటెక్ విద్యార్థులకు శుభవార్త.. టెక్నాలజీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఫ్రెషర్స్‌ని నియమించేందుకు ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ నిర్వహిస్తోంది. 
 
ఫ్రెషర్స్ కోసం విప్రో నిర్వహిస్తున్న హైరింగ్ ప్రోగ్రామ్ ఇది కావడంతో.. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అంటే 2022 సంవత్సరంలో బీటెక్ పాస్ కావాల్సి ఉంటుంది. 
 
ఈ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 30,000 మంది ఫ్రెషర్స్‌కి ఆఫర్ లెటర్స్ ఇవ్వనుంది విప్రో. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. మొత్తం 30,000 ఆఫర్ లెటర్స్ ఇస్తే వీరిలో 22,000 మంది ఫ్రెషర్స్ ఉద్యోగాల్లో చేరతారని విప్రో భావిస్తోంది.