బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (22:10 IST)

రియల్‌మి నుంచి రూ.9లకే ఫోన్.. ఫీచర్స్ ఇవే..

Realme
చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం అయిన రియల్‌మి కంపెనీ అతి తక్కువ ధరకు వినియోగదారులకు రూ.9వేలకే ఫోన్ అందించనుంది. రియల్‌మీ సీ21వై ద్వారా పలు ఫీచర్‌లను వినియోగదారులకు అందించనుంది. 
 
ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆగస్టు 23, 2021న ఇండియాలో లాంచ్ చేసింది. మొత్తం మీద రియల్‌మీ సీ21వై రెడ్ మీ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్, నోకియా జీ20 వంటి బడ్జెట్ ఫోన్లతో పోటీ పడనుంది. అందుబాటు ధరలే కాకుండా రియల్‌మీ సీ21వై క్రాస్ బ్లాక్, క్రాస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. 
 
ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. 
 
ఫీచర్‌లు ఇవే..
ప్రాసెసర్ - యునిసోక్ టీ610 ఆక్టా కోర్
కెమెరా - 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా
5 మెగాపిక్సెల్ కెమెరా(ఎఫ్/2.4 లెన్స్)
డిస్ ప్లే - 6.5 అంగుళాల హెచ్ డి+
ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ 11(Android 11), రియల్‌మీ యుఐ
స్టోరేజ్ సామర్థ్యం - 3జీబీ RAM /32 జీబీ స్టోరేజీ , మరో మోడటల్‌ 4జీబీ RAM /64 జీబీ స్టోరేజ్
బ్యాటరీ సామర్థ్యం - 5,000mHA (రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్)
ధరలు - రియల్‌మీ సీ21వై 3జీబీ RAM /32జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999
- 4జీబీ RAM /64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999