శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (09:25 IST)

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్.. ఏంటది?

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. వీడియో ఎడిటింగ్ మరింత సులువుగా మార్చేలా యూట్యూబ్ క్రియేట్ పేరిట కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్టు పేర్కొంది. ఈ యాప్ ప్రస్తుతం భారత్, అమెరికా, జర్మనీ, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌, ఫ్రాన్స్, బ్రిటన్‌తో సహా పలు మార్కెట్లలో ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వచ్చే ఏడాది ఐఫోన్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులోకి రానుంది.
 
ఈ ఉచిత యాప్‌లో షార్ట్, లాంగ్ వీడియోలకు ఏఐ సాయంతో అదనపు వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజీలు జోడించవచ్చు. వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్, ఎడిటింగ్ ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్  వంటి జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లు కొత్త యాప్‌లో ఉన్నాయని యూట్యూబ్ పేర్కొంది. వీడియో క్రియేషన్, షేరింగ్ సులువుగా, మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ యాప్ డిజైన్ చేసినట్టు యూట్యూబ్ పేర్కొంది.