గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (22:01 IST)

వాము ఆకు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

వాము ఆకు. వాము ఆకులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా ఈ వాము ఆకు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది.
 
వాము ఆకు తింటుంటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అజీర్ణ సమస్యతో కడుపు ఉబ్బరంగా వున్నవారు వాము ఆకు తింటే సమస్య తగ్గుతుంది. అధిక రక్తపోటు సమస్య వున్నవారు వాము ఆకు తింటే బీపీ అదుపులో వుంటుంది.
 
రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ వున్నవారు ఈ ఆకును తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు వాము డికాషన్‌ను తాగితే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. కొన్ని వాము ఆకులను తీసుకుని బాగా నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది.