శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (10:33 IST)

యూట్యూబ్ కీలక నిర్ణయం.. అలాంటి వీడియోల ఏరివేతకు ప్రత్యేక టీంలు

యూట్యూబ్‌ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ద్వారా నిరాధారమైన, అసత్య సమాచారాన్ని ప్రసారం చేసే వీడియోలను తొలగించనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయనుంది. 
 
ముఖ్యంగా, నిరాధార వార్తలను అరికట్టేందుకు, ఏ విధమైన ఎన్నికలు జరిగినా, వాటికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేయడాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించింది. 
 
అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందారని లేదా, ఎన్నికల తేదీల వ్యవహారంలో తప్పుడు సమాచారంగానీ పోస్ట్ చేస్తే, దాన్ని వెంటనే తొలగిస్తామని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
సంస్థ తరపున నియమించబడిన ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ టీమ్‌‌లు అన్ని వీడియోలనూ అనుక్షణమూ నిశితంగా పరిశీలిస్తుంటాయని స్పష్టం చేసింది. వార్తలకు నమ్మదగిన స్థానంగా యూట్యూబ్‌‌ను మార్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.