సైబర్ సెక్యూరిటీ సమ్మిట్.. 8 యేళ్ళ అమెరికా బాలుడి ప్రసంగం!
న్యూఢిల్లీ వేదికగా సైబర్ సెక్యూరిటీ సదస్సు ఒకటి గురువారం నుంచి ప్రారంభమైంది. ఇందులో అమెరికాకు చెందిన ఎనిమిదేళ్ళ బాలుడు కీలక ప్రసంగం చేయనున్నాడు. ఆ బాలుడి పేరు రూబెన్ పాల్. ఎనిమిదేళ్ళకే సైబర్ సెక్యూరిటీలో నైపుణ్యం సాధించాడు.
భారత సంతతికి చెందిన ఈ అమెరికన్ బాలుడు సైబర్ ఇప్పటికే ఈ తరహా నాలుగు సదస్సుల్లో కీలక ప్రసంగాలు చేసి ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాడు. తాజాగా న్యూఢిల్లీ సదస్సులో ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ కూడా రూబెన్ తరహాలోనే ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.
"ఏడాదిన్నర క్రితం కంప్యూటర్ పాఠాలు నేర్చకోవడం మొదలుపెట్టాను. ప్రస్తుతం సొంతంగా ప్రాజెక్టులను రూపొందించుకుంటున్నాను" అని రూబెన్ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఒడిశాకు చెందిన మనోపాల్ 2000 ఏడాదిలో అమెరికాకు వలసపోయారు. ఆయనే తన కొడుకు రూబెన్ పాల్‌కు కంప్యూటర్ పాఠాలు నేర్పారు. ప్రస్తుతం యాపిల్ ఐఓఎస్‌పై రూబెన్ పనిచేస్తున్నాడని మనోపాల్ చెప్పాడు.