పిల్లలకు చక్కెరతో దోసెలు, చపాతీలు తినిపిస్తున్నారా?
పిల్లలు పంచదారను ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్తపడాలి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలకు చక్కెరను ఎక్కువ అలవాటు చేస్తే.. గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వస్తాయని వారు హెచ్చరిస్తున
పిల్లలు పంచదారను ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్తపడాలి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. పిల్లలకు చక్కెరను ఎక్కువ అలవాటు చేస్తే.. గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు కారం కాసింతైనా అలవాటు చేయాలి. అలా కాకుండా చక్కెరను తదేకంగా అలవాటు చేస్తే.. అందులోని ఫ్యాటీ ఆమ్లాలు జీవక్రియ వేగాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా గుండెజబ్బులు తప్పవని తాజా పరిశోధనలో తేలింది.
ఈ మేరకు జరిగిన ఓ పరిశోధనలో పంచదార అధికంగా తీసుకునే పిల్లలో జీవక్రియను దెబ్బతీసే ఓలియాక్ ఆమ్లం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పంచదారను ఎక్కువగా తినడం వల్ల అది ఫ్యాటీ ఆమ్లాల అరుగుదల మీద తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తుంది. తద్వారా కాలేయ వ్యాధులతో పాటు హృద్రోగ సమస్యలకు దారితీసే అవకాశం ఉందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అందుకే పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు కూర, పప్పును అలవాటు చేయాలి. అంతేగాకుండా దోసెలు, చపాతీలకు పంచదారతో కలిపి తినిపిస్తే అనారోగ్య సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఇంకా మోతాదుకు మించి చక్కెరను వాడటం ద్వారా దగ్గు, జలుబు, అలెర్జీలు వంటి సమస్యలు ఏర్పడతాయి. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. అందుకే పిల్లలు తాగే పానీయాల్లో పంచదార శాతం మోతాదుకు మించకూడదని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.