ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By Selvi
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (11:18 IST)

యామాల పూజంటే ఏంటి? శివరాత్రి రోజున తోటకూర కట్టను సమర్పించినా..?

శివరాత్రి రోజున సంపద కలిగిన వారు తమ శక్తిని అనుగుణంగా బంగారు లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే.. అజ్ఞానాంధకారం నశిస్తుందని.. లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారిక

శివరాత్రి రోజున సంపద కలిగిన వారు తమ శక్తిని అనుగుణంగా బంగారు లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే.. అజ్ఞానాంధకారం నశిస్తుందని.. లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేనన్ని సంపదలు కలుగుతాయి. 
 
ఇంకా శివరాత్రి నాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని.. కనుక శివరాత్రినాడు ఉపవశించి ఒక్క బిల్వమైనా శివార్పణ చేసి తరించమని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మహాశివరాత్రి రోజున శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొనే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. మహాశివరాత్రి రోజున ఆలయాల్లో నాలుగు యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ప్రతి యామం పూజకు నిర్దుష్టమైన అభిషేకం జరుపుతారు. అలాగే నిర్ణీత నైవెద్యం, పారాయణం కొనసాగిస్తారు. 
 
ఇందులో తొలి యామం పూజలో అభిషేకం, అలంకారం ఉంటుంది. శ్రీగంధం లేపనంతో.. బిల్వపత్రాలు, తామరపువ్వులతో స్వామిని అర్చిస్తారు. నైవేద్యంగా పెసల పొంగలి సమర్పిస్తారు. పారాయణం - రుగ్వేదం, లభించే ప్రయోజనం - సౌభాగ్యం.. అంటే ఈ యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. 
 
రెండవ యామం పూజ : అభిషేకం - మధుపర్కం (చక్కెర, పాలు, పెరుగు, నెయ్యి) , అలంకారం - రోజానీరు, కర్పూరం గంధ లేపనం, అర్చన- బిల్వపత్రి-తులసి, నైవేద్యం - పాయసం, పారాయణం - యజుర్వేదం, లభించే ప్రయోజనం - సంతానం.
 
మూడవ యామం పూజ : అభిషేకం -తేనె , అలంకారం - కర్పూరం గంధ లేపనం, అర్చన- బిల్వపత్రి, మల్లెపూలు, నైవేద్యం - అన్నం, నువ్వులు, పారాయణం - సామ వేదం, లభించే ప్రయోజనం - సంపద లభిస్తుంది. 
 
నాల్గవ యామం పూజ : అభిషేకం -చెఱకురసం , అలంకారం - మల్లెలు మరియు నీటి పూలు కర్పూరం గంధ లేపనం, అర్చన- నీటిపువ్వులు.. మల్లెపూలు, నైవేద్యం - వండిన అన్నం, పారాయణం - అథర్వ వేదం, లభించే ప్రయోజనం - కుటుంబంతో సయోధ్య కుదురుతుందని పండితులు అంటున్నారు.