బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (12:52 IST)

పాయువులో బంగారం.. సాక్సుల్లో బంగారం దాచుకుని..?

బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఎయిర్‌పోర్టుల్లో పట్టుబడుతున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒకచోట బంగారం స్మగ్లర్లు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఇద్దరు బంగారం అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయారు. 
 
నిందితుల్లో ఒకరు సాక్సుల్లో బంగారం దాచుకుని ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కగా.. మరో వ్యక్తి పాయువులో బంగారాన్ని గుర్తించారు. నిందితులిద్దరి నుంచి మొత్తం 1.24 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ.53 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
 
విచారణలో అక్రమ రవాణాదారులు దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన 1.24 కిలోల బంగారాన్ని టాయిలెట్‌ వద్ద దాచిపెట్టిన సంగతిని వెల్లడించాడు. దేశీయ ప్రయాణికుడిగా వచ్చిన తాను ఆ బంగారాన్ని బయటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. 
 
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్‌ చానల్‌ వద్ద అధికారులు తనిఖీ చేస్తుండడంతో అక్రమ రవాణాదారులు బంగారాన్ని ఎయిపోర్టులోని టాయిలెట్‌లో దాచి దేశీయ ప్రయాణికుల ద్వారా బయటికి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.