ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 10 సెప్టెంబరు 2022 (11:27 IST)

గణేష్ నిమజ్జనంలో విషాదం.. నీటిలో గల్లంతై ఏడుగురు మృతి

Ganesh
Ganesh
హర్యానా రాష్ట్రంలో గణేష్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా నీటిలో గల్లంతై ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై హర్యానా సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
ఈ క్రమంలో హర్యానాలోని సోనిపట్‌లోని మిమార్‌పూర్ ఘాట్ వద్ద తన తండ్రి, కుమారుడు, మేనల్లుడు కలిసి గణపయ్యను నిమజ్జనానికి తీసుకెళ్లారు. గణపయ్యను నిమజ్జనం చేస్తున్న క్రమంలో వారు నీటిలోకి దిగారు. తొలుత కుమారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. 
 
అతన్ని కాపాడేందుకు తండ్రి, మేనల్లుడు ప్రయత్నం చేసే క్రమంగా నీటిలో మునిగిపోయి ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.