సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (10:49 IST)

సోనాలీ ఫోగట్ ఆస్తి కోసమే హత్య : నిందితుడి వాంగ్మూలం

sonali phogat
భారతీయ జనతా పార్టీ మహిళా నేత సోనాలీ ఫోగట్ హత్య వెనుక ఉన్న అనేక వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సోనాలీని ఆమె వద్ద పనిచేసే సిబ్బందే హత్య చేసినట్టు గోవా పోలీసులు నిర్ధారించారు. వీరిలో ప్రధాన నిందితుడుగా సుధీర్ సంగ్వాన్ ఉన్నాడు. 
 
సోనాలీ ఫోగట్‌పై కన్నేసిన ఆయన హర్యానాలోని ఆమె ఫామ్‌హౌస్‌లో పార్క్ చేసిన ఖరీదైన కార్లు, ఫామ్‌హౌస్‌లోని ఫర్నీచర్‌ను మాయం చేసినట్టు గోవా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముఖ్యంగా, సోనాలి ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నిన సంగ్వాన్... ఆమె ఫామ్‌హౌస్‌ను 20 యేళ్లకు లీజుకు తీసుకోవాలని పథకం వేశాడు. 
 
సోనాలి ఫామ్‌హౌస్ నుంచి మాయమైన వాటిలో మహీంద్రా స్కార్పియో సహా మూడు వాహనాలు ఉన్నాయి. కాగా, సోనాలీ ఫామ్‌హౌస్ ధర స్థలంతో కలిసి సుమారుగా రూ.110 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేశారు. దీన్ని లీజుకు తీసుకునేందుకు సంగ్వాన్ ప్లాన్ వేశాడు. 
 
ఇందుకోసం యేడాదికి రూ.60 వేలు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలని భావించాడు. కానీ, తాను అనుకున్నట్టుగా ఏదీ జరగక పోవడంతో సోనాలీని హత్య చేశారు. గోవాలో ఆమెకు కూల్‌డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి ఇచ్చినట్టు అంగీకరించాడు. 
 
పోస్టుమార్టం నివేదికలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు తేలిన తర్వాత పోలీసులు హిసార్ చేరుకుని దర్యాప్తు చేపట్టడంతో ఈ కేసులోని వాస్తవాలు వెలుగు చూశాయి.