గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ఆగివున్న లారీని ఢీకొట్టిన టెంపో వ్యాను...13 మంది మృత్యువాత

road accident
కర్నాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న లారీని అమిత వేగంతో దూసుకొచ్చిన ఓ టెంపో వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. బెళగావిలోని ఆలయాలను దర్శించుకుని వస్తుండగా ఈ ఘోరం జిరగింది. శుక్రవారం తెల్లవారుజామున హవేరి జిల్లా గుండెనహల్లి సమీపంలోని పూణె - బెంగుళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. 
 
ఆగివున్న లారీని ఓ టెంపో వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదస్థలిలోనే 13మంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నారు. మృతులను షిమోగా జిల్లా భద్రపతి తాలూకాలోన ఎమ్మినిహట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 
 
ప్రమాద తీవ్రతకు కొన్ని మృతదేహాలను టెంపో వ్యానులోనే చిక్కుకునిపోయాయి. వీటిని వెలికి తీసేందుకు శ్రమించాల్సివచ్చింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టంమీద టెంపో వ్యానులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. కాగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.