గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (22:50 IST)

దేశవ్యాప్తంగా 14 వేల ఆధార్ కేంద్రాలు

దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో 14 వేల ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉన్నట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. 
 
ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆధార్ కేంద్రాలతోపాటు పోస్టాఫీసులు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ సెంటర్లు తదితర వాటిలో మొత్తం 14 వేల ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉన్నట్టు యూఐడీఏఐ ట్వీట్ చేసింది. 
 
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లోని మాదాపూర్, విజయవాడలోని లబ్బీపేట, విశాఖపట్టణంలోని ద్వారకానగర్, వరంగల్‌లోని నయీంనగర్‌లలో ప్రస్తుతం ఆధార్ సేవా కేంద్రాలు తెరుచుకున్నట్టు తెలిపింది.