శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (10:00 IST)

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్ ... 19 మంది మృత్యువాత

తమిళనాడు రాష్ట్రంలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. 
 
ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు సమీపంలో ఉన్న అవినాసి వద్ద జరిగింది. తిరుప్పూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును అతివేగంతో వచ్చిన ఓ కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు.. అంబులెన్స్‌లను రప్పించి, క్షతగాత్రులను తిరుప్పూరు, కోయంబత్తూరు జిల్లాల ప్రధాన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.