శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (10:59 IST)

జమ్మూకాశ్మీర్‌లో భూకంపం.... రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. గురువారం ఉదయం భూమి కంపిస్తుండటాన్ని గమనించిన ప్రజలు ప్రాణభయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. 
 
అనేక ప్రాంతాల్లో గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఆస్తి నష్టం మాత్రం స్వల్పంగా జరిగింది. 
 
ఈ ప్రకంపనల ప్రభావం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కనిపించాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భూకంపం సంభవించిన మాట వాస్తవమేనని అధికారులు వెల్లడించారు.