శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన... రోజులు గడుస్తున్నా మానిపోని గుర్తులు

coromandel tragedy
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన జరిగి రోజులు గడిచిపోతున్నప్పటికీ ఆ గుర్తులు మాత్రం ఇంకా చెరిగిపోలేదు. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ రైలు ప్రమాదంలో జరగ్గా 288 మంది చనిపోయారు. మరో వెయ్యి మంది వరకు గాయపడ్డారు. 
 
అయితే, ఈ ప్రమాదం జరిగి ఐదు రోజులు గడిచినా ప్రమాదం తాలూకు గుర్తులు ఏమాత్రం చెరిగిపోలేదు. ప్రమాదంలో దెబ్బతిన్న బోగీలను పట్టాల పక్కనే పడేశారు. వాటిని చూడటం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బహనాగ్ స్టేషనులో రైల్వే కార్యకపాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. 
 
ముఖ్యంగా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్‌కు వచ్చే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. అయితే, ఈ సారి కూడా కార్మికులు, వలస జీవులతో ఈ రైలు కిక్కిరిసిపోవడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాలు అలస్యంగా 3.25 గంటలకు షాలిమర్ నుంచి బయలుదేరింది. 
 
రెండో నెంబర్ ప్లాట్‌‍ఫాంపై రైలు ఆగిన వెంటనే బోగీల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు. ఇక, సెకండ్ క్లాస్ బోగీలు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. గత శుక్రవారం కోరమాండల్ ప్రమాదంలో తన 18 కుమారుడిని కోల్పోయిన సందేశ్ కాళీ కూడా తాజాగా ఇదే రైలు ఎక్కారు. మరోసారి తన కుమారుడిని వెతికేందుకు ఆయన బయలుదేరడం గమనార్హం.