1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (11:03 IST)

అరుదైన జాతి పాము... దాని విలువ కోటి రూపాయలు

snake
అత్యంత అరుదైన జాతికి చెందిన పామును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాము ధర అక్షరాలా కోటి రూపాయలు పలుకుతుంది. అలాంటి పామును కొందరు స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తుండగా అటవీ శాఖ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ పాము పేరు రెడ్ శాండ్ బోవా. ఇదొక అరుదైన జాతికి చెందిన సర్పం. అక్రమ మార్కెట్‌లో దీని ధర రూ.కోటికి పైగానే పలుకుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
ఇలాంటి పామును వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగుడిలో స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లర్లను సిలిగుడి మున్సిపాలిటీ పరిధిలోని శాస్త్రి నగర్‌లో పట్టుబడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ పామును బిహార్ నుంచి తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు. బైకాంతపుర్ ఫారెస్ట్ డివిజన్‌లోని ఓ ఇంట్లో భద్రంగా నిల్వఉంచారని, దీనిపై పక్కా సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి పామును స్వాధీనం చేసుకున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.