గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (17:06 IST)

Asia Book of Records-నాలుగేళ్ల చిన్నారి యోగాలో అదుర్స్

నాలుగేళ్ల చిన్నారి యోగాలో ఎలాంటి ఆసనాలనైనా అలవోకగా వేస్తోంది. ఒడిశాలోని నయాగఢ్‌కు చెందిన చిన్నారి ప్రియా ప్రియదర్శిని నాయక్‌ ఈ యోగాసనాలతోనే ఆసియా బుక్ ఆఫ్​ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ పాప తండ్రి ప్రకాశ్ యోగా గురువు. ఆయన క్లాసులు చెప్పేదగ్గరకు వెళ్లినప్పుడు చూసి ప్రియా యోగాపై ఆసక్తి పెంచుకుంది. ఇంటికి వెళ్లాక ఒక్కటే కూర్చుని ఆసనాలు ప్రాక్టీస్ చేయడం చూసిన ప్రకాశ్.. ఆ పాపకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు.
 
తన స్టూడెంట్స్‌తో పాటు స్ట్రెచ్ యోగాసనాలను కూతురు ప్రియాతో కూడా ప్రాక్టీస్ చేయించాడు. తండ్రి శిక్షణ, ఆ చిన్నారి పట్టుదల వల్ల యోగాసనాల్లో మంచి పట్టు సాధించగలిగింది. 
 
యోగాలో అన్ని రకాల ఆసనాలను బాగా చేయగలుగుతుండడంతో ఇప్పుడు ప్రియాకు జిమ్నాస్ట్‌గా ట్రైనింగ్ ఇస్తున్నానని, తను దేశానికి మెడల్స్ సాధించాలన్నదే టార్గెట్‌గా పెట్టుకున్నానని ప్రకాశ్ చెబుతున్నాడు. తాను చిన్నప్పుడు జిమ్నాస్ట్‌గా ఎదగాలని ఆశపడేవాడినని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోటీల్లోకి పాల్గొనే వరకూ వెళ్లలేకపోయానని చెప్పాడు.