శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (08:37 IST)

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - ట్రెండ్స్ ఇవే...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. 
 
అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల మేరకు ప్రస్తుతం బీజేపీ అధిక్యంలో కొనసాగుతుంటే, సమాజ్‌వాదీ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధిక్యంలో కొనసాగుతుంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, మణిపూర్‌లో కాంగ్రెస్, గోవాల్ కాంగ్రెస్ పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి. 
 
ఈ ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. యూపీలో మొత్తం 403 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. దీంతో 75 జిల్లాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. పంజాబ్‌లో 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోనూ ఒకే దశలో కూడా పోలింగ్ నిర్వహించారు.