శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (12:22 IST)

దేశంలో 55 శాతం కరోనా కేసులు కేరళలోనే..!

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. ఎప్పటిలాగే మంగళవారం కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కన్పించగా.. బుధవారం మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా కేసులు మళ్లీ 40వేలకు చేరువ కాగా.. దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుండడం కాస్త ఊరటనిస్తోంది.
 
* గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 17,77,962 మందికి పరీక్షలు నిర్వహించగా.. 38,353 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కేసుల(28,204)తో పోలిస్తే ఇది 36శాతం ఎక్కువ. అయితే కొత్త కేసుల్లో సగానికి పైగా(55శాతం) ఒక్క కేరళలోనే నమోదవడం గమనార్హం. నిన్న ఆ రాష్ట్రంలో 21,119 కొత్త కేసులు బయటపడగా.. 152 మంది మృతిచెందారు.
 
* అటు మరణాల్లోనూ పెరుగుదల కన్పించింది. నిన్న మరో 497 మంది వైరస్‌తో మరణించారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,29,179 మందిని బలితీసుకుంది.
 
* ఒక్క రోజులో 40,013 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 3.12 కోట్ల మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 97.45 శాతానికి చేరింది.
 
* కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య 4 లక్షలకు దిగువనే ఉంది. ప్రస్తుతం 3,86,351 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.21 శాతంగా ఉంది.
 
* ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మంగళవారం మరో 41,38,646 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 51,90,80,524కు చేరింది.