శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (13:01 IST)

ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరికి కరోనా పాజిటివ్

ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు పెడదారిన పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ త్రిపురలోని తబారియా ప్రాంతానికి చెందిన ఏడుగురు బాలురు సమీపంలో నివసించే మూడోతరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఆడుకుందామని పిలిచారు.
 
అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారంతా 10-12 ఏళ్ల బాలురే కావడం గమనార్హం. ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు బాలురుని అదుపులోకి తీసుకున్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వారిద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నలుగురిని జువైనల్‌ హోంకు తరలించారు. మరో బాలుడు పరారీలో ఉన్నాడు.