మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (11:10 IST)

అక్టోబర్‌ నెలలో భారతీయులు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకున్నారో తెలుసా?

అక్టోబర్‌ నెలలో భారతీయులు అధికంగా చర్చించుకున్న అంశం ఏంటో తెలుసా.. మీటూనేనట. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలతో దేశంలో ఉద్యమం ఊపందుకుంది. ఆపై దేశ వ్యాప్తంగా మీ టూ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. 
 
హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు దిగుమతి అయిన మీ టూ ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో గత నెలలో భారతీయులు ఎక్కువగా చర్చించుకున్న అంశం మీటూనేనని గ్లోబల్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ మెల్ట్‌వేర్ పేర్కొంది.
 
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాల్లో 25 శాతం మీటూ గురించేనని తెలిపింది. అమెరికాలో 22 శాతం మంది ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. మీటూ గురించి తొలుత హాలీవుడ్‌లో చర్చకు వచ్చింది. మీటూ ఆరోపణలపై కేంద్రమంతి ఒకరు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
 
కాగా మీ టూ గురించి అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు డేటాను విశ్లేషించగా.. ఈ విషయం బయటపడినట్లు మెల్ట్‌వేర్ తెలిపింది. మీటూపై అక్టోబరులో మొత్తంగా 28,900 ఎడిటోరియల్ న్యూస్ వచ్చింది. ఇందులో 95 శాతం అక్టోబరు 10 నుంచి 18 మధ్య రావడం గమనార్హం.