గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (11:53 IST)

కరీంగంజ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... తొమ్మిది మంది మృతి

అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంగంజ్‌ జిల్లాలోని బైతఖల్‌ వద్ద ఆటోను ఓ సిమెంట్‌ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది మృతిచెందారు. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
గురువారం ఉదయం 7.30 గంటలకు అసోం-త్రిపుర జాతీయ రహదారి 8పై బైతఖల్‌ వద్ద ఆటోను ట్రక్కు ఢీకొట్టిందని చెప్పారు. తొమ్మిది మంది ఘటనా స్థలంలోనే మృతిచెందారని, మరొకరు దవాఖానలో మరణించారని వెల్లడించారు. ఛాట్‌ పూజ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల్లో మహిళలు, యువతులు, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పారు.