బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 మార్చి 2021 (11:13 IST)

చెట్టు కింద నిలబడ్డవారిపై పిడుగు, కుప్పకూలిపోయారు- video

గుర్గావ్‌లో దారుణం చోటుచేసుకుంది. చెదుమదురుగా వర్షం ప్రారంభం కావడంతో వర్షంలో తడిసిపోకుండా ఉండటానికి నలుగురు వ్యక్తులు చెట్టు కింద తలదాచుకున్నారు. ఐతే అకస్మాత్తుగా ఓ పిడుగు వారు నిలబడిన చెట్టుపై పడింది. దీనితో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర సంఘటన సెక్యూరిటీ కెమెరాలో చిక్కింది.
 
ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం గుర్గావ్ సెక్టార్ 82 లోని సిగ్నేచర్ విల్లాస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద జరిగింది. ఈ నలుగురు రెసిడెన్షియల్ సొసైటీలోని హార్టికల్చర్ సిబ్బంది. చినుకుల నుండి తప్పించుకోవడానికి చెట్టు కింద నిలబడిన వారిపై పిడుగు పడినట్లు సిసిటివి ఫుటేజ్ చూపిస్తుంది. అకస్మాత్తుగా మెరుపు చెట్టును తాకింది.
 
సెకన్ల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు కుప్పకూలిపోయారు. నాల్గవ వ్యక్తి ఒక సెకను తరువాత నేల మీద పడిపోయాడు. ఒకరు అక్కడికక్కడే మృత్యువాడ పడగా మరొకరు తీవ్రమైన కాలిన గాయాలతో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా వుంది. శుక్రవారం ఉదయం నుండి మానేసర్ సమీపంలోని కొత్త గుర్గావ్‌లో వర్షం పడుతోంది. వర్షంతో పాటు బలమైన గాలులు, మెరుపులతో పడుతోంది.
 
సహజంగా ఉరుములు, మెరుపులు రాగానే చాలామంది చెట్ల కిందకు వెళ్తుంటారు. ఐతే పిడుగులు ఎత్తయిన కట్టడాలు, చెట్ల పైనే పడుతుంటాయని నిపుణులు చెపుతున్నారు. అందువల్ల ఉరుములతో కూడిన వర్షం పడుతుంటే చెట్ల కిందకు వెళ్లకుండా కాంక్రీట్ భవనాల్లో తలదాచుకోవాలి.